చంద్రబాబు తయారు చేస్తున్న బలిపశువుల్లో పట్టాభి ఒకరు: వైసీపీ నేత సి.రామచంద్రయ్య

21-10-2021 Thu 13:31
  • సమాజం ప్రశాంతంగా ఉండడం బాబుకు నచ్చదు
  • చాలా మంది నేతలు టీడీపీని వీడుతున్నారు
  • అందుకే ఇలాంటి వ్యాఖ్యలతో గొడవలు రాజేస్తున్నారు
Pattabhi A Scape Goat For Chandrababu Criticizes C Ramachandraiah
రాష్ట్రంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని, పోగొట్టుకున్న ఉనికిని తిరిగి తెచ్చుకునేందుకే పట్టాభితో వ్యాఖ్యలు చేయిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తయారు చేస్తున్న బలిపశువుల్లో పట్టాభి ఒకరని అన్నారు. పట్టాభి అంత గొప్ప నేత ఏమీ కాదని చెప్పారు.

సమాజం ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు నచ్చదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూశాక చాలా మంది నేతలు టీడీపీని వదిలేస్తున్నారని ఆయన చెప్పారు. అందుకే పట్టాభితో పిచ్చి కామెంట్లు చేయించి గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.