Nakka Anand Babu: పక్కా ప్రణాళిక ప్రకారమే అంతా జరిగింది: నక్కా ఆనందబాబు

Attack on TDP offices done with perfect planning says Nakka Anand Babu
  • టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఏక కాలంలో దాడులు జరిగాయి
  • బూతులు మాట్లాడటాన్ని ప్రారంభించింది వైసీపీ నేతలు కాదా?
  • జగన్ అరాచక పాలనను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది
ఏపీలో జీవించే హక్కును, వాక్ స్వాతంత్ర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, వివిధ ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై ఏక కాలంలో దాడులు జరిగాయని... ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వైసీపీ పాలనలో ప్రతి రోజు అవమానాలు ఎదురవుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు.

తొలుత బూతులు మాట్లాడటాన్ని ప్రారంభించింది వైసీపీ మంత్రులు, నేతలు కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గంజాయికి ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని... దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా... దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని విమర్శించారు. వివిధ రాష్ట్రాల పోలీసులు ఏపీ నుంచే గంజాయి వస్తోందని చెపుతున్నారని అన్నారు.
Nakka Anand Babu
Telugudesam
Jagan
YSRCP
Drugs

More Telugu News