Sharmila: వైఎస్సార్ బిడ్డగా మాటిస్తున్నాను.. కడవరకు పోరాడతాను: ష‌ర్మిల‌

sharmila begins padayathra 2nd day
  • ప్రజా ప్రస్థానంలో మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేనిది
  • మీకోసం పోరాడాలన్న తపన రెట్టింపవుతోంది
  • ప్రజల కష్టాలు తీర్చేందుకు నిరంతరం ఉద్యమిస్తాను
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి నిన్న వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ వారి క‌ష్టాలు తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల నుంచి వస్తున్న స్పంద‌న ప‌ట్ల ఆమె స్పందిస్తూ ఈ రోజు ట్వీట్ చేశారు.

'ప్రజా ప్రస్థానంలో మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఎన్నటికీ మరువలేనివి. మీ కన్నీళ్లను, కష్టాలను చూస్తుంటే మీకోసం పోరాడాలన్న తపన రెట్టింపవుతోంది. వైఎస్సార్ బిడ్డగా మాటిస్తున్నాను.. ప్రజల తరుఫున కడవరకు పోరాడతాను. ప్రజల కష్టాలు తీర్చేందుకు నిరంతరం ఉద్యమిస్తాను' అని ష‌ర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె రెండో రోజు పాద‌యాత్ర ప్రారంభించారు.
Sharmila
YSRTP
Telangana

More Telugu News