Kommareddy Pattabhi Ram: అర్ధరాత్రి తోట్లవల్లూరు చేరుకున్న కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు

Police stopped Kollu Ravindra in Thotlavalluru
  • జగన్ ను దూషించారంటూ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పట్టాభిపై కేసు నమోదు
  • ఫిర్యాదు ఎవరు చేశారో వెల్లడించని పోలీసులు
  • తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు
  • ఎవరినీ అనుమతించని పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ ఫిర్యాదు ఎవరు చేశారో మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడికి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

విషయం తెలిసిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అర్ధరాత్రి దాటిన తర్వాత తోట్లవల్లూరు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మీడియాను కూడా అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Kommareddy Pattabhi Ram
Jagan
Kollu Ravindra
Arrest
Vijayawada

More Telugu News