Andhra Pradesh: టీడీపీ నేత పట్టాభికి బదులు స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పేరుతో వైసీపీ శ్రేణుల ఆందోళన

YCP Workers used Freedom Fighter name Bhogarju instead of TDP Leader Pattabhi
  • టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ఆందోళన
  • పి.గన్నవరంలో భోగరాజు పేరును ఫ్లెక్సీపై ముద్రించిన వైసీపీ శ్రేణులు
  • ఆ ఫ్లెక్సీతోనే ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిన్న తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. పి.గన్నవరంలోనూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అయితే, వారు ప్రదర్శించిన ఫ్లెక్సీలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ పేరుకు బదులుగా ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరును ముద్రించి ఆందోళనకు దిగారు.

అది చూసిన స్థానికులు విస్తుపోయారు. అనుచిత వ్యాఖ్యలు చేసింది టీడీపీ నేత అయితే, భోగరాజును వీధుల్లోకి లాక్కొచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Andhra Pradesh
YSRCP
Pattabhi
Bhogaraju Pattabhi Sitaramayya
TDP

More Telugu News