Chandrababu: చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్షలు

YSRCP taking up Janagraha Deeksha from tomorrow
  • 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో చంద్రబాబు దీక్ష
  • రేపు, ఎల్లుండి 'జనాగ్రహ దీక్షలు' చేపడుతున్న వైసీపీ
  • రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను చేపట్టనున్నారు. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో 36 గంటల పాటు దీక్షను కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ కూడా నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ 'జనాగ్రహ దీక్షలు' పేరుతో దీక్షలను చేపట్టబోతోంది. ముఖ్యమంత్రి జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తో రేపు, ఎల్లుండి దీక్షలను చేపట్టనున్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ పోటాపోటీగా దీక్షలకు దిగనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Deeksha

More Telugu News