నా ఒంటిపై ఒక గాయం కూడా లేదంటూ వీడియో విడుదల చేసిన పట్టాభి.. పోలీసు కస్టడీలో చిన్న గీత పడినా జగన్ బాధ్యత వహించాలని వ్యాఖ్య!

20-10-2021 Wed 21:25
  • పట్టాభి అరెస్ట్ కు రంగం సిద్ధం
  • ఇంటి వద్ద దాదాపు  200 మంది పోలీసులు
  • తనకేమైనా జరిగితే జగన్ దే బాధ్యత అన్న పట్టాభి
Pattabhi releases video of his body
టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం పట్టాభి ఇంటి తలుపు వేసుకుని లోపలే ఉన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ, వారెంట్ చూపించాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు పట్టాభి ఓ వీడియోను విడుదల చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు 200 మంది పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారని ఆయన తెలిపారు. తన ఒంటిపై చిన్న గాయం కూడా లేదంటూ శరీర అవయవాలను చూపించారు. పోలీస్ కస్టడీలో తన ఒంటికి చిన్న గీత పడినా ముఖ్యమంత్రి జగన్, డీజీపీ బాధ్యత వహించాలని అన్నారు. గతంలో రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారని... అందుకే తాను వీడియోను చూపిస్తున్నానని చెప్పారు.