యూ ట్యూబ్ ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయంటూ.. కోర్టును ఆశ్ర‌యించిన సినీ న‌టి స‌మంత‌

20-10-2021 Wed 16:30
  • సుమన్ టీవీ, తెలుగు పాప్యులర్ టీవీలపై దావా
  • దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ 
  • ఈ సాయంత్రం విచారించనున్న కూకట్ పల్లి కోర్టు
Samantha files defamation suit against Youtube Channels
తన పరువుకు భంగం కలిగించారంటూ యూట్యూబ్ ఛానళ్లపై సినీ నటి సమంత కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తెలుగు పాప్యులర్ టీవీ, సుమన్ టీవీలతో పాటు సీఎల్ వెంకట్రావుపై పిటిషన్ దాఖలు చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తనను కించపరిచారంటూ కూకట్ పల్లి కోర్టును ఆమె ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలను ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను ఈ సాయంత్రం కోర్టు విచారించనుంది. సమంత తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. హీరో అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంతపై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.