అందమైన ఆ ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి.. సమంత పోస్ట్

20-10-2021 Wed 14:11
  • క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డిని కలిసిన హీరోయిన్
  • డెహ్రాడూన్ పర్యటనలో సామ్.. ఇన్స్టాలో పోస్ట్
  • శిల్ప ఫ్యామిలీతో వారం పాటు సరదాగా గడిపిన సామ్
Sam Meets Her Closest Friend
నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న తర్వాత సమంత మళ్లీ మామూలు జీవితంలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే దసరారోజున తాను చేసే ప్రాజెక్టులను ప్రకటించింది. త్వరలోనే వాటి షూటింగులలో బిజీ కానుంది. ఆ లోపున్న ఖాళీ సమయాన్ని తన సన్నిహితులతో కలిసి గడుపుతోంది. అందులో భాగంగానే తన అత్యంత సన్నిహిత స్నేహితురాలిని ఆమె కలిసింది.

డిజైనర్ శిల్పారెడ్డి, ఆమె ఫ్యామిలీతో సరదాగా గడిపింది. నిన్న సాయంత్రం డెహ్రాడూన్ టూర్ కు వెళ్లింది. ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందం, సరదా, ఆనంద క్షణాల ఈ వారం ఎంతో వేగంగా గడిచిపోయిందంటూ పోస్ట్ పెట్టింది. ఫ్లైట్ లో దిగిన ఫొటోలను, డెహ్రాడూన్ లో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇక, అంతకుముందు శిల్పారెడ్డి ఫ్యామిలీతో సామ్ టగ్ ఆఫ్ వార్ ఆడిన సంగతి తెలిసిందే.