ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ఎంతో ప్రశాంతత కలిగిస్తోంది: కేఎల్ రాహుల్

20-10-2021 Wed 13:46
  • ధోనీకి ఇంకా వయసు అయిపోలేదు
  • తిరిగి జట్టుతో కలవడం సంతోషంగా ఉంది
  • ధోనీ సారథ్యంలో చాలా మ్యచ్‌లు  ఆడాం
  • ఆ స‌మ‌యంలోనూ ధోనీని  మెంటార్‌గానే చూశామన్న రాహుల్ 
kl rahul response on dhoni appointment as mentor
టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా మెంటార్‌గా మ‌హేంద్ర సింగ్ ధోనీ నియమితుడయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీనిపై కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్ జ‌రిగిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... డ్రెస్సింగ్ రూమ్‌ను ధోనీతో పంచుకోవడం ఎంతో ప్రశాంతత కలిగిస్తోంద‌ని అన్నాడు.

ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని రాహుల్ చెప్పాడు. మ‌ళ్లీ ఇప్పుడు ధోనీ జట్టుతో తిరిగి కలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ధోనీ సారథ్యంలో తాము చాలా మ్యాచ్‌లు ఆడామని తెలిపాడు. ఆ స‌మ‌యంలోనూ ధోనీని తాము మెంటార్‌గానే చూశామని చెప్పాడు.

క్రికెట్, కెప్టెన్సీ వంటి అన్ని రకాల విష‌యాల‌ను ధోనీ నుంచి నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఇప్ప‌టికీ ధోనీ త‌మ‌లో ఎవరికైనా గట్టి పోటీని ఇవ్వగలడని తాను అనుకుంటున్నానని తెలిపాడు.