ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిర‌స‌న‌లు.. చంద్ర‌బాబు, ప‌ట్టాభి దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం

20-10-2021 Wed 13:22
  • చంద్రబాబు, పట్టాభిరామ్  వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళ‌న‌లు
  • రోడ్లపై బైఠాయించి నిర‌స‌న‌లు
  • ప‌లు చోట్ల‌ ర్యాలీలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత‌ పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. విజయవాడ సితార సెంటర్‌లో కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ నిర‌స‌న‌లు తెలుపుతోంది.  

కడప అంబేద్కర్‌ కూడలిలో, పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వ‌హించారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతపురం బుక్కరాయ సముద్రంలో టీడీపీ దిష్టిబొమ్మను వైసీపీ కార్య‌క‌ర్త‌లు దహనం చేశారు. టీడీపీ నేత‌ల‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మ‌రోవైపు, టీడీపీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు కూడా నిర‌స‌న‌లు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే.