కాబోయే భ‌ర్త‌తో క‌లిసి ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్న హీరోయిన్ న‌య‌న‌తార.. ఫొటోలు వైర‌ల్

20-10-2021 Wed 12:03
  • దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ తో క‌లిసి మ‌హారాష్ట్ర‌లో ఉన్న న‌య‌నతార‌
  • షిర్డీ వెళ్లిన ప్రేమికులు
  • ముంబైలోనూ ప‌లు ఆల‌యాల సంద‌ర్శ‌న‌
  • ఇద్ద‌రూ క‌లిసి షాపింగ్  
nayanatara pics go viral
ప్రేమలో మునిగితేలుతోన్న దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ కు సంబంధించిన ఫొటోలు మ‌రోసారి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో విఘ్నేశ్‌ పోస్ట్ చేశాడు. హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇటీవ‌లే న‌య‌న‌తార‌ పూణే వెళ్లింది.

ఆ షూటింగ్ లో విరామం ల‌భించ‌డంతో ప్రియుడు విఘ్నేశ్ శివ‌న్‌తో క‌లిసి షిర్డీ వెళ్లింది. అనంత‌రం ముంబైలో ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శించింది. వారిద్ద‌రు క‌లిసి షాపింగ్ కూడా చేశారు. కాగా, చాలా కాలంగా ప్రేమించుకుంటోన్న న‌య‌న్‌- విఘ్నేశ్ శివ‌న్ నిశ్చితార్థం ఇప్ప‌టికే జ‌రిగిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. న‌య‌న‌తార ప్ర‌స్తుతం షారుక్‌ ఖాన్ సినిమాలో నటిస్తోంది.