చంద్రబాబు ఆదేశాల ప్ర‌కార‌మే టీడీపీ నేత‌లు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు: ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్ శ్రీకాంత్ రెడ్డి

20-10-2021 Wed 11:02
  • జ‌గ‌న్‌పై కుట్రలో భాగంగా పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారు
  • చంద్రబాబు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారు?
  • పట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌కు అర్థమేమిటో తెలుసా?
srikanth reddy slams chandrababu
తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు ఆదేశాల‌తోనే ఆ పార్టీ నేత‌లు అభ్యంత‌ర‌క‌ర రీతిలో ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్‌పై కుట్రలో భాగంగా పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని ఆయ‌న విమర్శించారు. అసలు చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారని శ్రీ‌కాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. పట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌కు అర్థమేమిటో తెలుసా? అని ఆయ‌న నిల‌దీశారు.

చంద్రబాబు గురించి ఎవరిని అడిగినా ఆయ‌న  వెన్నుపోటు పొడిచార‌ని, కుట్రదారుడ‌ని చెబుతార‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన‌ రెండున్నరేళ్లలో సీఎం జగన్‌ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తార‌ని, పబ్లిసిటీ కోసం దేనికైనా తెగిస్తారని శ్రీ‌కాంత్ రెడ్డి ఆరోపించారు. జ‌గ‌న్‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేసిన పట్టాభి వెంట‌నే క్షమాపణ చెప్పాలని ఆయ‌న అన్నారు.