'ఏజెంట్' అఖిల్ కి మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్!
- షూటింగు దశలో 'ఏజెంట్' సినిమా
- న్యూ లుక్ తో కనిపించనున్న అఖిల్
- కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
- ఆర్మీ ఆఫీసర్ గా మమ్ముట్టి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అఖిల్ న్యూ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమాతో 'సాక్షి వైద్య' అనే మలయాళ బ్యూటీ తెలుగు తెరకి పరిచయం కానుంది. ఇక ఈ సినిమాలో ఒక కీలమైన పాత్ర కోసం మమ్ముట్టిని అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఆ తరువాత ఆయన చేస్తున్నాడా? లేదా? అనే అప్ డేట్ మాత్రం రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో యూరప్ లో జరగనున్న షెడ్యూల్లో ఆయన పాల్గొననున్నారని అంటున్నారు. ఆయన ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారని చెబుతున్నారు.