శ్రీకాకుళంలో విషాదం.. చెరువులో ప‌డ్డ స్కూలు బ‌స్సు.. ఒక విద్యార్థి మృతి

20-10-2021 Wed 10:52
  • ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో ఘ‌ట‌న‌
  • ఎనిమిది మంది విద్యార్థుల‌తో వెళ్తున్న‌ స్కూల్ బస్సు  
  • మిగిలిన విద్యార్థులను ర‌క్షించిన‌ స్థానికులు
శ్రీకాకుళంలో ఈ రోజు ఉద‌యం విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో ఎనిమిది మంది విద్యార్థుల‌తో వెళ్తున్న‌ ఓ ప్రైవేటు స్కూల్ బస్సు చెరువులో బోల్తా పడడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ విద్యార్థి పేరు మైలపల్లి రాజుగా స్థానికులు గుర్తించారు.

ఈ ప్ర‌మాదంలో నీటిలో ప‌డిన‌ మిగిలిన విద్యార్థులను స్థానికులు వెంట‌నే రక్షించడంతో ప్రాణాపాయం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని స‌హాయ‌ చ‌ర్య‌లు ప్రారంభించి, విద్యార్థుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. చెరువులో పడిన స్కూలు బస్సును బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.