ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా 'రాధే శ్యామ్' టీజర్!

20-10-2021 Wed 10:36
  • పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • విక్రమాదిత్యగా ప్రభాస్ 
  • ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే 
  • జనవరి 14వ తేదీన విడుదల
RadheShyam teaser out on 23rd October
ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇంతవరకూ పెద్దగా అప్ డేట్స్ వచ్చింది లేదు.

అయితే ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా నుంచి వెంటవెంటనే అప్ డేట్స్ ఇస్తూ దూకుడు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ పుట్టినరోజు నుంచి ఇక అప్ డేట్స్ ఆలస్యం కాకుండా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెల 23వ తేదీ ప్రభాస్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

ఆ రోజున ఉదయం 11:16 నిమిషాలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటలీ నేపథ్యంలో నడుస్తుంది. పునర్జన్మతో ముడిపడిన ఈ ప్రేమకథలో, విక్రమాదిత్యగా ప్రభాస్ ..  ప్రేరణ పాత్రలో పూజ కనిపించనున్నారు.