దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

20-10-2021 Wed 10:12
  • కొత్త‌గా 14,623 క‌రోనా కేసులు
  • నిన్న‌ 197 మంది మృతి
  • మొత్తం 3,41,08,996 క‌రోనా కేసులు
  • ఇప్పటివరకు 4,52,651 మంది మృతి
corona bulletin in india
దేశంలో కొత్త‌గా 14,623 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 19,446 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 197 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,08,996 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో 1,78,098 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,78,247 మంది కోలుకున్నారు. మొత్తం 4,52,651 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 41,36,142 క‌రోనా డోసులు వినియోగించారు. దీంతో మొత్తం వినియోగించిన క‌రోనా డోసుల సంఖ్య 99,12,82,283కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 7,643 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 77 మంది మృతి చెందారు.