zomato: హిందీ అందరికీ తెలిసి ఉండాలన్న ఉద్యోగిని తొలగించి.. క్షమాపణ చెప్పిన జొమాటో

Zomato  Apologizes to customer Over Hindi Row
  • జొమాటోలో తప్పుగా డెలివరీ అయిన ఫుడ్
  • కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేస్తే హిందీ తెలిసి ఉండాలన్న ఉద్యోగి
  • ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిన నెటిజన్లు
  • దెబ్బకు దిగొచ్చిన జొమాటో
హిందీ జాతీయ భాష అని, అది అందరికీ తెలిసి ఉండాలన్న ఉద్యోగిని తొలగించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. క్షమాపణలు తెలిపింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడుకు చెందిన ఆకాశ్ మొన్న జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే, అది తప్పుగా డెలివరీ కావడంతో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కస్టమర్ కేర్ ఉద్యోగి హిందీలో మాట్లాడడంతో ఆకాశ్ తనకు హిందీ రాదని బదులిచ్చాడు.

దీనికి సదరు ఉద్యోగి మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష అని, అది అందరికీ తెలిసి ఉండాలని అన్నాడు. ఈ సంభాషణ మొత్తాన్ని ఆకాశ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. జొమాటో తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. జొమాటోకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. దీంతో స్పందించిన జొమాటో ఆకాశ్‌కు క్షమాపణలు తెలిపింది. హిందీ తెలిసి ఉండాలన్న ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్టు వివరణ ఇచ్చింది. అంతేకాదు, కోయంబత్తూరులో తమిళ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది.
zomato
Tamil Nadu
Hindi
Apolozy

More Telugu News