సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

20-10-2021 Wed 09:14
  • విద్యుత్ ప్యానెల్ బోర్డులో చెలరేగిన మంటలు
  • భయ భ్రాంతులకు గురైన ఆసుపత్రి సిబ్బంది, రోగులు
  • ప్రమాదం చాలా చిన్నదన్న అగ్నిమాపక సిబ్బంది
Minor fire accident in Secunderabad Gandhi Hospital
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లోనే ఆసుపత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం చాలా చిన్నదేనని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.