లోకేశ్ అనకాపల్లి పర్యటన రద్దు.. నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

20-10-2021 Wed 08:17
  • నిన్నటి ఘటనల నేపథ్యంలో భద్రత పెంపు
  • తిరుపతి అర్బన్ ఎస్పీ ఆదేశాలతో పోలీసుల మోహరింపు
  • దాడులకు నిరసనగా బంద్ పాటిస్తోన్న టీడీపీ
Police tighten Security in Chandrababu Village naravaripalli
టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ ముఖ్యనేతల ఇళ్లపై దుండగులు దాడులకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాలతో పోలీసులను మోహరించారు.

మరోవైపు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు అనకాపల్లిలో పర్యటించాల్సి ఉండగా నిన్నటి ఘటనల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు తెలిపారు. కాగా, దాడులకు నిరసనగా టీడీపీ నేడు రాష్ట్రంలో బంద్ పాటిస్తోంది.