సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

20-10-2021 Wed 07:29
  • అలాంటి సినిమాలు వద్దంటున్న కీర్తి 
  • సంక్రాంతికి ష్యూర్ అంటున్న మహేశ్!  
  • 'రాధేశ్యామ్' క్లైమాక్స్ కి 50 కోట్లు?  
Keerti Suresh says no to heroine oriented films
*  'మహానటి' తర్వాత కీర్తి సురేశ్ 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' వంటి హీరోయిన్ ప్రధాన చిత్రాలలో నటించింది. అయితే, పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. 'గుడ్ లక్ సఖి' వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఇలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేయకూడదని కీర్తి నిర్ణయించుకుందట. ఇకపై హీరోల సరసన కథానాయిక పాత్రలే చేయాలని ఈ చిన్నది నిర్ణయించుకున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరోపక్క, అన్నాత్తే, సాని కాయధమ్, భోళాశంకర్ వంటి సినిమాలలో చెల్లెలి పాత్రలు కూడా చేస్తోంది.    
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి కాస్త ముందుగా అంటే జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో, చాలా సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. అయితే, మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట' చిత్రాన్ని మాత్రం ముందుగా ప్రకటించినట్టు జనవరి 13న విడుదల చేయడానికే మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
*  ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' చిత్రం గురించి పలు విశేషాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల గురించి ఒక అప్ డేట్ వచ్చింది. పదిహేను నిమిషాల పాటు సాగే ఈ పతాక సన్నివేశాల చిత్రీకరణ కోసం సుమారు 50 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. భారీ స్థాయి క్లైమాక్స్ కావడంతో ఆ రేంజిలో ఖర్చు చేశారట. ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.