టీ20 వరల్డ్ కప్: రాణించిన నయీం, షకీబల్... బంగ్లాదేశ్ స్కోరు 153 రన్స్

19-10-2021 Tue 21:47
  • బంగ్లాదేశ్ వర్సెస్ ఒమన్
  • టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్
  • అర్ధసెంచరీ సాధించిన నయీం
  • దూకుడుగా ఆడిన షకీబల్
Bangladesh posted respectable score against Oman
టీ20 వరల్డ్ కప్ లో ఒమన్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ నయీం 50 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. కెప్టెన్ మహ్మదుల్లా 17 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ జట్టులో మరెవ్వరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ బట్ 3, కలీముల్లా 2, జీషన్ మక్సూద్ 1 వికెట్ తీశారు.