కాజల్ సమర్పిస్తున్న ప్రేమకథా చిత్రం .. షూటింగ్ కంప్లీట్!

19-10-2021 Tue 19:29
  • శివ కందుకూరి హీరోగా 'మను చరిత్ర'
  • కథానాయికగా మేఘ ఆకాశ్
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన
  • దర్శకుడిగా భరత్ పెదగాని పరిచయం  
Manucharithra shooting completed
ఆ మధ్య కాజల్ కాస్త నిర్మాణ రంగం వైపు ఆసక్తిని చూపించింది. ఆ సమయంలో తాను సమర్పకురాలిగా వ్యవహరించిన సినిమానే 'మనుచరిత్ర'. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం. శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, భరత్ పెదగాని దర్శకత్వం వహించాడు.

శివకందుకూరి కథానాయకుడిగా నటించగా, ఆయన సరసన నాయికగా మేఘ ఆకాశ్ అలరించనుంది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇటీవల మేఘ ఆకాశ్ నుంచి వచ్చిన రెండు సినిమాలు యూత్ ను అలరించాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.