అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడితే మనకెందుకు బాధ?: ఒవైసీ

19-10-2021 Tue 18:29
  • బుర్ఖా వేసుకున్న అమ్మాయి ముస్లిం అబ్బాయితో తిరిగితే పట్టించుకోరు
  • బుర్ఖా వేసుకున్న అమ్మాయి వేరే అబ్బాయితో తిరిగితే దాడి చేస్తారు
  • ప్రేమిస్తే అడ్డుకునే హక్కు మనకు లేదు
We dont have any right to oppose love says Owaisi
ముస్లిం మహిళలపై జరుగుతున్న దాడులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అమ్మాయి ఇష్టపడి ఎవరినైనా ప్రేమిస్తే అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. బుర్ఖా వేసుకున్న అమ్మాయి ముస్లిం అబ్బాయితో తిరిగితే పట్టించుకోరని... అదే బుర్ఖా వేసుకున్న అమ్మాయి మరొక అబ్బాయితో తిరిగితే దాడి చేస్తారని తప్పుపట్టారు. అమ్మాయి ఆమెకు నచ్చిన మనిషిని ఇష్టపడితే మనకెందుకు బాధ అని అడిగారు. ఆడవాళ్లకు ఒక న్యాయం, మగవాళ్లకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు. మనం 1969లో లేమని, 2021లో ఉన్నామని... కాలానికి తగ్గట్టుగా మారాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ప్రేమిస్తే అడ్డుకునే హక్కు మనకు లేదని చెప్పారు.