పట్టాభి దొరికితే చంపేస్తామని హెచ్చరించారు: తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు

19-10-2021 Tue 18:26
  • విజయవాడలో పట్టాభి నివాసంపై దాడి
  • సాయంత్రం 4.30 గంటలకు దాడి జరిగిందన్న కుటుంబసభ్యులు
  • 200 మంది తమ ఇంటిపై దాడి చేశారని వెల్లడి
  • గట్టిగా అరుస్తూ విధ్వంసానికి పాల్పడ్డారని వివరణ
Pattabhi family members told media what happened
విజయవాడలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసంపై దాడి జరగడం తెలిసిందే. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సాయంత్రం 4.30 గంటల సమయంలో దాడి జరిగిందని తెలిపారు. సుమారు 200 మంది వరకు తమ ఇంటిపైన దాడి చేశారని వివరించారు. గట్టిగా కేకలు వేస్తూ సామగ్రి ధ్వంసం చేశారని, పట్టాభి దొరికితే చంపేస్తామని హెచ్చరించారని కుటుంబ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. కాగా, పెద్ద పెద్ద రాళ్లు తీసుకువచ్చిన దుండగులు పట్టాభి నివాసంలోని కారును, బైకును, అక్కడున్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.