'ప్రేమతీరం' టైటిల్ తో మలయాళంలోకి 'లవ్ స్టోరీ'

19-10-2021 Tue 18:14
  • క్రితం నెలలో వచ్చిన 'లవ్ స్టోరీ'
  • తొలిరోజే హిట్ టాక్ 
  • ఇంకా తగ్గని వసూళ్ల జోరు
  • మలయాళంలో సాయిపల్లవికి క్రేజ్  
Love Story movie will release om Malayalam
తెలుగు తెరపైకి ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'లవ్ స్టోరీ' ప్రధానమైన స్థానాన్ని సంపాదించుకుంది. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా, సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలైన తొలి రోజునే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లకు పెద్ద సంఖ్యలో జనాలను రప్పించిన సినిమా ఇది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. డాన్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటు చైతూ .. అటు సాయిపల్లవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.

అలాంటి ఈ సినిమాను ఇప్పుడు మలయాళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ప్రేమ తీరం' అనే టైటిల్ తో ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళంలో సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. అందువలన అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.