దళితులను జగన్ అణచివేస్తున్నారు: పీతల సుజాత

19-10-2021 Tue 18:11
  • ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చేశారు
  • నక్కా ఆనందబాబుపై వేధింపులు ఆపాలి
  • లేకపోతే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
Jagan is suppressing Dalits says Peethala Sujatha
టీడీపీ నేత నక్కా ఆనందబాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకురాలు పీతల సుజాత మాట్లాడుతూ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఆనందబాబుకు నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నం నుంచి పోలీసులు వచ్చే బదులు అక్కడ గంజాయి సాగుచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని చెప్పారు. పోలీసులను పంపి దళిత నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని... ఇలాంటి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. నక్కా ఆనందబాబుపై వేధింపులు ఆపకపోతే... దళితులంతా కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.