కోట్లు సంపాదించావు... బిచ్చగత్తెకు ఇచ్చేది పది రూపాయలేనా?: సారా అలీఖాన్ పై నెటిజన్ల ధ్వజం

19-10-2021 Tue 18:10
  • కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వచ్చిన సారా
  • ముంబయిలో ఓ రెస్టారెంట్ లో విందు భోజనం
  • బిచ్చగత్తెకు తొలుత ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన సారా
  • ఆపై రూ.10 నోటు దానం
Trolling on Bollywood actress Sara Ali Khan
సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సినీ తారలు ఏంచేసినా సరే విమర్శనాత్మకంగా చూసే ధోరణి ఎక్కువైంది. ట్రోలింగ్ పేరిట ఏకిపారేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కు ఇదే సమస్య ఎదురైంది.

ముంబయిలో తన తల్లి అమృతా సింగ్, సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి ఓ రెస్టారెంట్ లో భోజనం చేసిన అనంతరం కారులో ఎక్కేందుకు సారా బయటికి రాగా, ఓ బిచ్చగత్తె చేయిచాచింది. దాంతో సారా ఆమెకు ఓ బిస్కట్ ప్యాకెట్ అందించింది. అయినప్పటికీ ఆ బిచ్చగత్తె వెళ్లకపోవడంతో ఓ పది రూపాయల నోటు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట దర్శనమిస్తోంది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

"కోట్లు సంపాదించావు... బిచ్చగత్తెకు పది రూపాయలే ఇస్తావా?" అంటూ విరుచుకుపడ్డారు. "పాపం, సారా వద్ద పది రూపాయలే ఉన్నాయి!" అంటూ మరొకరు, "మా మిడిల్ క్లాసోళ్లం నయం... బిచ్చగాళ్లకు మీకంటే ఎక్కువే ఇస్తాం!" అంటూ ఇంకొకరు స్పందించారు. ఇలాంటివే అనేక రకాల వ్యాఖ్యలతో సారా అలీఖాన్ ను విమర్శించారు.