విజయవాడలో టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడి

19-10-2021 Tue 17:35
  • సీఎం జగన్ పై వ్యాఖ్యల పట్ల వైసీపీ శ్రేణుల ఆగ్రహం
  • పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు
  • పట్టాభి నివాసంలో సామగ్రి ధ్వంసం
  • మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపైనా దాడి
 Attack on TDP leader Kommareddy Pattabhiram residence
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసంపై దుండగులు దాడి చేశారు. విజయవాడలోని పట్టాభి ఇంట్లోకి చొరబడిన దుండగులు అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. ఇదిలావుంచితే, సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పలు జిల్లాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.

టీడీపీ నేతల్లో క్రమం తప్పకుండా గళం వినిపించే వారిలో పట్టాభి ఒకరు. ఆయన తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. తాజాగా నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై  పట్టాభి చేసిన విమర్శలు వైసీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి. గతంలోనూ ఓసారి పట్టాభి వాహనాన్ని దుండగులు ధ్వసం చేయడం తెలిసిందే.