టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ స్కోరు 20 ఓవర్లలో 165-9

19-10-2021 Tue 17:16
  • స్కాట్లాండ్ వర్సెస్ పాపువా న్యూ గినియా
  • మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్
  • రిచీ బెర్రింగ్టన్ విధ్వంసక ఇన్నింగ్స్
  • 49 బంతుల్లో 70 పరుగులు
  • రాణించిన మాథ్యూ క్రాస్
  • 4 వికెట్లు తీసిన కబువా మొరియా
Scotland Vs Papua New Guinea
టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సెకండ్ డౌన్ బ్యాట్స్ మన్ రిచీ బెర్రింగ్ టన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. బెర్రింగ్టన్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేశాడు. అతడికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాథ్యూ క్రాస్ నుంచి విశేష సహకారం లభించింది. 36 బంతులు ఎదుర్కొన్న క్రాస్ 2 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు.

వీరిద్దరు తప్ప స్కాట్లాండ్ టీమ్ లో మరెవ్వరూ రాణించలేదు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్కాట్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. పాపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మొరియా 4, చాద్ సోపర్ 3, సైమన్ అతాయ్ 1 వికెట్ తీశారు.