బాబోయ్... ఇలాంటి ఫ్యామిలీతో టగ్ ఆఫ్ వార్ కష్టమే!: సమంత

19-10-2021 Tue 16:45
  • సోషల్ మీడియాలో వీడియో పంచుకున్న సమంత
  • ఫ్రెండ్స్ తో కలిసి టగ్ ఆఫ్ వార్
  • కిందపడిన సమంత 
  • పొట్టచెక్కలయ్యేలా నవ్విన వైనం 
Samantha plays tug of war with friends
అందాల నటి సమంత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. ఆ వీడియోలో సమంత, ఆమె స్నేహితులు టగ్ ఆఫ్ వార్ ఆడారు. వాస్తవానికి ఈ వీడియోను సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి పోస్టు చేయగా, సమంత దాన్ని రీపోస్ట్ చేశారు. ఈ టగ్ ఆఫ్ వార్ లో సమంత కిందపడి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుండడం చూడొచ్చు.

దీనిపై సమంత స్పందిస్తూ... ఫిట్ నెస్ అంటే పడిచచ్చే, పోటీతత్వానికి మారుపేరులా నిలిచే ఫ్యామిలీతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడకూడదు. మనం ఏ మాత్రం నెగ్గలేం సరికదా, మనకు దెబ్బలు కూడా తగులుతాయి అంటూ వ్యాఖ్యానించారు.