తండ్రి సంపాదించింది చూసుకుని కేటీఆర్ మొరుగుతున్నారు: రేవంత్ రెడ్డి

19-10-2021 Tue 16:24
  • నేను ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కోర్టుకు వెళ్తున్నారు
  • పిరికి వాళ్ల గురించి ఏం మాట్లాడతాం
  • 2009లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి మహబూబ్ నగర్ కు వచ్చారు
Revanth Reddy fires on KTR
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కోర్టుకు వెళ్తున్నారని... అలాంటి పిరికి వాళ్ల గురించి ఏం మాట్లాడతామని అన్నారు. బీసీలపై దళితులను ఉసిగొల్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ఉంటున్నాయని దుయ్యబట్టారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి మహబూబ్ నగర్ కు వచ్చారని ఎద్దేవా చేశారు. తండ్రి కేసీఆర్ సంపాదించినది చూసుకుని కేటీఆర్ మొరుగుతున్నారని అన్నారు. తండ్రీకొడుకులకు తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెపుతారని వ్యాఖ్యానించారు.