విజయనగరంలో ప్రారంభమైన సిరిమాను ఉత్సవం... సంచయిత దూరం!

19-10-2021 Tue 16:21
  • హాజరైన అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు
  • తనకు ఆహ్వానం అందలేదన్న సంచయిత
  • గతేడాది మాన్సాస్ చైర్ పర్సన్ హోదాలో పాల్గొన్న సంచయిత
  • కోర్టు ఆదేశాలతో చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్న వైనం
Vijayanagaram Sirimanotsavam starts
దసరా పండుగ అనంతరం ప్రతి ఏడాది విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సిరిమాను ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి కోట బురుజుపై ఆసీనులయ్యారు. అయితే సంచయిత గజపతి ఈసారి సిరిమాను ఉత్సవానికి దూరమయ్యారు.

గతేడాది మాన్సాస్ చైర్మన్ హోదాలో ఈ వేడుకల్లో పాల్గొన్న సంచయిత ఈసారి ఉత్సవాల్లో కనిపించలేదు. ఆమె ఇటీవల కోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్సాస్ చైర్ పర్సన్ బాధ్యతల నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా, తనకు ఈ ఏడాది సిరిమాను ఉత్సవం కోసం ఆహ్వానం అందలేదని సంచయిత చెబుతున్నారు. అటు, గతేడాది సిరిమాను ఉత్సవంలో తమకు ఎదురైన అనుభవాల పట్ల అసంతృప్తికి గురైన సుధా గజపతి ఈసారి ఆనందోత్సాహాలతో ఉత్సవంలో పాల్గొన్నారు.