ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన హైదరాబాద్ యువతులు... కిషన్ రెడ్డి చొరవతో క్షేమం

19-10-2021 Tue 15:57
  • ఉత్తరాఖండ్ లో వాన విలయం
  • గత మూడ్రోజులుగా భారీ వర్షాలు, వరదలు
  • భవనంపైకి చేరిన యువతులు
  • అధికారులను అప్రమత్తం చేసిన కిషన్ రెడ్డి
Hyderabad girls stranded in Uttarakhand floods
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గత మూడ్రోజుల నుంచి ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నలుగురు హైదరాబాద్ యువతులు ఇక్కడి వరదల్లో చిక్కుకున్నారు. వారు ఉంటున్న భవనాన్ని వరద చుట్టుముట్టడంతో వారు భవనంపైకి చేరారు. ఆ యువతులు గత మూడ్రోజులుగా భవనంపైనే ఉంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి, అధికారులను అప్రమత్తం చేశారు. కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మంత్రి ఆదేశాలతో సహాయచర్యలు వేగవంతం చేశారు. రెస్క్యూ బృందం ఎంతో శ్రమించి ఆ నలుగురు హైదరాబాద్ యువతులను కాపాడింది. అనంతరం వారిని ఢిల్లీకి తరలించారు.