టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ వర్సెస్ పాపువా న్యూ గినియా

19-10-2021 Tue 15:36
  • అల్ అమేరత్ మైదానంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్
  • మరో విజయంపై కన్నేసిన స్కాటిష్ జట్టు
  • తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సంచలన విజయం
Scotland plays against Papua New Guinea
టీ20 వరల్డ్ కప్ లో ఈ మధ్యాహ్నం స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు అల్ అమేరత్ మైదానం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ తన తొలి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సంచలన విజయం సాధించి మాంచి ఊపుమీదుంది. పాపువా న్యూ గినియా తన తొలి మ్యాచ్ లో ఒమన్ చేతిలో ఓడిపోయింది.

నేటి మ్యాచ్ లో స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించడం చూస్తుంటే పాపువా న్యూ గినియా జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. స్కాటిష్ జట్టులో హార్డ్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది.