Jagan: 'జగనన్న తోడు' లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపు వడ్డీ జమచేయనున్న జగన్‌

Jagan to deposit interest amount to the beneficiaries of Jagananna Thodu
  • రూ. 16.36 కోట్లను జమ చేయనున్న జగన్
  • ఈ పథకం ద్వారా 9.05 మందికి రుణాలు అందించిన ప్రభుత్వం
  • అర్హులైన వారికి ప్రతి ఏటా రూ. 10 వేల వడ్డీ లేని రుణం  
'జగనన్న తోడు' పథకంలో భాగంగా లబ్దిదారుల వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది. తొలి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.

ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా రూ. 10 వేలు వడ్డీ లేని రుణాలను అందజేస్తోంది. ఈ మొత్తానికి సంబంధించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. సకాలంలో రుణాన్ని చెల్లించే వారికి తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
Jagan
YSRCP
Jagananna Thodu

More Telugu News