IYR Krishna Rao: ఏపీ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే బాధేస్తోంది.. సరైన నాయకుడు లేకపోవడం దురదృష్టకరం: ఐవైఆర్ కృష్ణారావు

  • ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయి
  • ప్రభుత్వ భూములను తాకట్టు పెడుతున్నారు
  • అప్పులు ఎంతకాలం పుడతాయి?
AP financial situation is very worst says IYR Krishna Rao

వైసీపీ సర్కార్ పై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారయిందని... పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరయిన ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి నెలకొందని అన్నారు.

విశాఖ నగరంలో ప్రభుత్వ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితిని మనం చూస్తున్నామని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలని చెప్పారు. సామర్థ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని... వీటన్నింటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అప్పులు తీసుకురావడం... వాటిని పంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే పని అప్పులు తెచ్చి పంచడమేనా? అని ప్రశ్నించారు. ఎంతకాలం అప్పులు పుడతాయని అడిగారు.

More Telugu News