మంచు విష్ణును గుండెలకు హ‌త్తుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వీడియో పోస్ట్ చేసి వ‌దంతుల‌కు చెక్ పెట్టిన మంచు వార‌బ్బాయి

19-10-2021 Tue 11:55
  • అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న ప‌వ‌న్, విష్ణు
  • కాసేపు స‌ర‌దాగా మాట్లాడుకున్న సినీ హీరోలు
  • మాట్లాడుకోలేదంటూ రెండు రోజులుగా ప్ర‌చారం
pawan hugs vishnu
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అసలు మాట్లాడుకోలేద‌ని, ఎడమొహం పెడమొహంగా ఉన్నారనీ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేద‌ని ఇప్ప‌టికే విష్ణు స్ప‌ష్ట‌త నిచ్చారు. ఈ రోజు ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.  

అలాయ్ బలాయ్ కార్య‌క్ర‌మంలో విష్ణును ప‌వ‌న్ క‌ల్యాణ్ గుండెల‌కు హ‌త్తుకున్నారు. అనంత‌రం వారిద్ద‌రూ కాసేపు స‌ర‌దాగా మాట్లాడుకున్నారు. వీరితో పాటు దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు కూడా మాట కలిపారు.