హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న ట్రాఫిక్ ఆంక్ష‌లు

19-10-2021 Tue 11:39
  • మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ఆంక్ష‌లు
  • రాత్రి 8 గంటల వరకు కొన‌సాగింపు
  • హైద‌రాబాద్‌లో శాంతి ర్యాలీ
  • సాలార్జంగ్ మ్యూజియానికి సెల‌వు
traffic restrictions in hyd
హైదరాబాద్ లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ముస్లింలు హైద‌రాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వ‌హిస్తోన్న నేప‌థ్యంలో ఈ రోజు రాత్రి 8 గంటల వరకు ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ముఖ్యంగా పాతబస్తీలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.  

ర్యాలీ వెళ్తున్న మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రిస్తామ‌ని చెప్పారు. గులాం ముర్తుజా కాలనీలోని సయ్యద్‌ ఖాద్రీ చమాన్, ఇంజన్‌లితో పాటు షంషీర్ గంజ్, లాల్‌ దర్వాజా మోడ్, చార్మినార్ లోని నారాయణ స్కూల్, మక్కా మసీదు, చార్‌ కమాన్, గుల్జార్‌ హౌస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. అలాగే, పిస్తా హౌస్, నయాపూల్, సాలార్జంగ్‌ మ్యూజియం, ఎస్‌జే రోటరీ, దారుల్‌షిఫా ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తామ‌ని చెప్పారు. కాగా, సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సెల‌వు ఉంటుంది, అక్క‌డ‌కు సంద‌ర్శ‌కులు రావ‌ద్ద‌ని సూచించారు.