అడవి నుంచి విదేశాలకు 'పుష్ప'

19-10-2021 Tue 10:10
  • షూటింగు దశలో 'పుష్ప'
  • త్వరలో మూడు పాటల చిత్రీకరణ
  • ఆసక్తిని పెంచుతున్న రష్మిక లుక్
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల    
Pushpa movie update
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా చకచకా ఘాటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. టాకీ పరంగా ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును పూర్తిచేసుకుంది. కొంత టాకీతో పాటు మూడు పాటలను ఇంకా చిత్రీకరించవలసి ఉందని అంటున్నారు.

వీటిలో రెండు పాటలను ఇక్కడే చిత్రీకరించనున్నారు. ఈ పాటికే వీటి చిత్రీకరణ పూర్తయ్యేది. కానీ ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా కుదరలేదు. అందువలన ఆ పాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక మరో పాటను విదేశాల్లో ప్లాన్ చేశారట. వచ్చేనెలలో ఈ సినిమా టీమ్ విదేశాలకు వెళ్లనుందని అంటున్నారు.

ఆ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందన్న మాట. ఇప్పటికే వదిలిన రెండు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ పాత్రను డిజైన్ చేసిన తీరు .. రష్మిక లుక్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నాయి.