నౌకపైనుంచి కిందపడి మలేషియాలో సూర్యాపేట వాసి మృతి

19-10-2021 Tue 08:48
  • మలేషియాలోని షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్న రిషి
  • రిషి మృతి విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపిన కంపెనీ ప్రతినిధులు
  • మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లలో కంపెనీ
Suryapet youth died in Malaysia
తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతి చెందాడు. పట్టణానికి చెందిన మోటకట్ల రిషివర్ధన్ మలేషియాలోని ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం అతడు విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఓడ పైనుంచి సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కంపెనీ ప్రతినిధులు సూర్యాపేటలోని రిషి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుమారుడి మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటరమణారెడ్డి, మాధవి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రిషి మృతదేహాన్ని సూర్యాపేట తరలించేందుకు షిప్పింగ్ కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది.