సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

19-10-2021 Tue 07:18
  • 'ఆహా' కోసం సమంత వెబ్ సీరీస్
  • పూణేలో చరణ్ సినిమా షూటింగ్
  • వరుణ్ తేజ్ కామెడీ ఎంటర్ టైనర్  
Samantha to do web series for Aha
*  ఇటీవల 'ద ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సీరీస్ లో బోల్డ్ గా నటించి వార్తల్లో నిలిచిన కథానాయిక సమంత త్వరలో మరో వెబ్ సీరీస్ లో నటించే అవకాశం వుంది. 'ఆహా వీడియో' ఓటీటీ సంస్థ సమంత కోసం ఓ మంచి కథను తయారుచేసింది. త్వరలోనే ఇది మెటీరియలైజ్ కావచ్చని తెలుస్తోంది.
*  రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపొందే పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి పూణేలో జరుగుతుంది. ఇందుకోసం పూణేలో ఓ భారీ సెట్ ను కూడా వేశారు. ఈ సెట్లో చరణ్, కియారా కాంబినేషన్లో ముందుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు.
*  ఆమధ్య 'భీష్మ' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తాడు. ఇది కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని సమాచారం.