ఏపీలో మరో 332 మందికి కరోనా

18-10-2021 Mon 21:02
  • గత 24 గంటల్లో 30,219 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 74 కేసులు
  • రాష్ట్రంలో ఆరుగురి మృతి
  • ఇంకా 5,709 మందికి చికిత్స
AP Covid daily status report
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,219 కరోనా పరీక్షలు నిర్వహించగా, 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 కొత్త కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో 51, గుంటూరు జిల్లాలో 50 నెల్లూరు జిల్లాలో 39 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 651 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,60,804 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,40,782 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,709 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,313కి పెరిగింది.