హుజూరాబాద్ ఎన్నిక తర్వాతే దళిత బంధు అమలు... ఈసీ ఆదేశాలు

18-10-2021 Mon 20:51
  • టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళిత బంధు
  • హుజూరాబాద్ లో అమలు
  • ఈసీకి ఫిర్యాదులు
  • ఓటర్లను ప్రభావితం చేస్తోందని నివేదన
EC Orders to halt Dalit Bandhu till Huzurabad By Election completed
తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం అమలుకు బ్రేక్ పడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు దళిత బంధు అమలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది. ఎన్నికల వేళ హుజూరాబాద్ ఓటర్లను దళిత బంధు పథకం ప్రభావితం చేసేలా ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావించింది. ఇప్పటికే కొందరు లబ్దిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్టు తెలుస్తోంది.