టీ20 వరల్డ్ కప్: నమీబియాపై టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

18-10-2021 Mon 20:07
  • టీ20 వరల్డ్ కప్
  • శ్రీలంక వర్సెస్ నమీబియా
  • పసికూనతో లంకేయుల సమరం
  • 6 ఓవర్లలో 2 వికెట్లకు 29 రన్స్ చేసిన నమీబియా
Sri Lanka won the toss against Namibia
టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో మ్యాచ్ లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడుతున్నాయి. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టు అటు అనుభవజ్ఞులు, యువకుల కలయికతో పటిష్ఠంగా కనిపిస్తోంది. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని నమీబియా ఈ మ్యాచ్ లో శ్రీలంకకు ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. మొదట బ్యాటింగ్ కు దిగిన నమీబియా 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.

ఇక, టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో, టీమిండియా నేడు ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ పోరు దుబాయ్ లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 7 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో పతనమైన రెండు వికెట్లు షమీ ఖాతాలో చేరాయి.