విఠలాచార్య మార్కు సినిమాలు చేయాలనుంది: 'నాట్యం' డైరెక్టర్!

18-10-2021 Mon 20:06
  • మొదటి నుంచి దర్శకత్వం అంటే ఇష్టం
  • ఈ సినిమా చేసే ఛాన్స్ అలా వచ్చింది
  • అన్ని అంశాలు కుదిరిన అందమైన కథ ఇది
  • ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల    
Natyam movie update
సంధ్య రాజు ప్రధాన పాత్రధారిగా .. స్వీయ నిర్మాణంలో 'నాట్యం' సినిమా రూపొందింది. పుట్టిపెరిగిన ఊరు .. ప్రాణంగా భావించే నాట్యం .. మనసైన వాడిని పొందలేని పరిస్థితుల మధ్య నలిగిపోయే ఒక యువతి కథ ఇది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన థియేటర్లకు రానుంది.

తాజాగా ఈ సినిమాను గురించి దర్శకుడు మాట్లాడుతూ .. "మాది అనకాపల్లి .. యూఎస్ లో స్టడీస్ పూర్తిచేశాను. మొదటి నుంచి కూడా దర్శకత్వం పట్ల ఆసక్తి ఉంది. నా మొదటి సినిమా విశ్వనాథ్ గారి సినిమాలా కళాత్మకంగా ఉండాలని భావించాను. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఒక పుస్తకంలోని కథ నుంచి ప్రేరణ పొంది నేను కథను రెడీ చేసుకున్నాను.

సంధ్యరాజు  గారితో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను .. నా టేకింగ్ నచ్చడంతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నాట్యం చుట్టూ అల్లుకున్న కథాకథనాలు .. పాటలు బాగా కుదిరాయి. విడుదలకు ముందే ఈ సినిమా ప్రశంసలు తెచ్చిపెడుతోంది. భవిష్యత్తులో విఠలాచార్య మార్కు సినిమాలు చేయాలనుంది" అని చెప్పుకొచ్చాడు.