ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీ నియామకం... జాబితా విడుదల చేసిన అచ్చెన్నాయుడు

18-10-2021 Mon 19:53
  • గతేడాది టీడీపీ డిజిటల్ వింగ్ కు శ్రీకారం
  • రాష్ట్రస్థాయి కమిటీ నియామకానికి చంద్రబాబు ఆమోదం
  • అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం
  • సోషల్ మీడియాలో ప్రకటన చేసిన అచ్చెన్న
ITDP State Committee announced
సోషల్ మీడియాలోనూ, డిజిటల్ వేదికలపైనా తమ బాణీని బలంగా వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ గతేడాది ఐ-టీడీపీ విభాగాన్ని తీసుకువచ్చింది. క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే తెరపైకి తేవడం, పార్టీ నేతలకు, కార్యకర్తలకు మధ్య వారధిలా వ్యవహరించడం ఐ-టీడీపీ స్థాపన వెనుక ముఖ్య ఉద్దేశాలు. ఈ నేపథ్యంలో, తాజాగా ఐ-టీడీపీ రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీని నియమించినట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యక్షులుగా సితారి శ్రీనాథ్ (ఆత్మకూరు), దమ్మాలపాటి కౌశిక్ (నందిగామ), సోంపల్లి శ్రీకాంత్ (ఉరవకొండ), కరుటూరి రఘునాథరావు చౌదరి (కొత్తపేట) నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా రామకృష్ణ కిలపర్తి (నర్సీపట్నం), కడియాల వెంకటరత్నం (పెనమలూరు), అనిగళ్ల సత్యవంశీ (కైకలూరు) నియమితులయ్యారు. వైజాగ్ నార్త్ నియోజకవర్గానికి చెందిన రామ్ తొండెపు ఐ-టీడీపీ కోశాధికారిగా నియమితులయ్యారు.