హరీశ్ రావుకు చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమే: రేవంత్ రెడ్డి

18-10-2021 Mon 18:14
  • కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోంది
  • కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారు
  • హరీశ్ ను ఇంటికి పంపే ప్లాన్ చేస్తున్నారు
Finally Harish Rao gets Mitra Drohi title says Revanth Reddy
హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

మంత్రి హరీశ్ రావును కేసీఆర్ శాశ్వతంగా ఇంటికి పంపే ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత హరీశ్ కు మిత్రద్రోహి అనే టైటిల్ మాత్రమే మిగులుతుందని చెప్పారు. టీఆర్ఎస్ లో తిరుగుబాటు జరిగే ప్రమాదం ఉందని... అందుకే కేసీఆర్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ చాలా అసహనంగా ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన విపక్షాలను కుక్కలు, నక్కలతో పోల్చుతున్నారని విమర్శించారు.