ఈ నెల 30న బద్వేలు నియోజకవర్గంలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

18-10-2021 Mon 18:05
  • బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • అక్టోబరు 30న పోలింగ్
  • ఓటర్ల సౌలభ్యం కోసం సెలవు ప్రకటన
  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు వర్తింపు
Govt announced holiday in Budvel constituency on polling day
బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోలింగ్ రోజున బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బద్వేలు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది.

బద్వేలు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అకాలమరణం చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆనవాయితీ పాటిస్తూ, డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకు వైసీపీ టికెట్ కేటాయించగా, టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను నిలపలేదు. బీజేపీ పనతల సురేశ్ కు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు.