'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఖరారు!

18-10-2021 Mon 17:37
  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
  • అక్టోబర్ 29వ తేదీన విడుదల
Romantic movie release date confirmed
ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. పూరి - ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి పూరి మాటలు .. స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఆయనకి ఇది తొలి సినిమా. టైటిల్ ను బట్టి ఇది రొమాంటిక్ పాళ్లు ఎక్కువగా ఉన్న లవ్ స్టోరీ అనే విషయం అర్థమవుతూనే ఉంది.

ఈ సినిమాను విడుదలకు ముస్తాబుచేసి చాలా రోజులే అయింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో, సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయింది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషించారు. మకరంద్ దేశ్ పాండే .. మందిరాబేడీ .. దివ్య దర్శిని .. ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. .